అదంతా వట్టి ప్రచారమే : ఎంపీ కవిత | TRS will not join NDA : kavitha | Sakshi
Sakshi News home page

అదంతా వట్టి ప్రచారమే : ఎంపీ కవిత

Published Fri, Feb 26 2016 7:04 PM | Last Updated on Sat, Oct 20 2018 5:26 PM

అదంతా వట్టి ప్రచారమే : ఎంపీ కవిత - Sakshi

అదంతా వట్టి ప్రచారమే : ఎంపీ కవిత

న్యూఢిల్లీ :  కేంద్రప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరుతుందంటూ వస్తున్న వార్తలను ఆ పార్టీ నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కె.కవిత ఖండించారు. ఇది అంతా వట్టి ప్రచారమే అని ఆమె తెలిపారు. శుక్రవారం న్యూఢిల్లీలో కె.కవిత విలేకర్లతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ పార్టీకి, కేంద్రానికి మధ్య ఉన్న సంబంధాలు ప్రభుత్వ సంబంధాలే అని ఆమె స్పష్టం చేశారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీని కలిసిన తర్వాత కొన్ని పనులు వేగవంతమయ్యాయని వెల్లడించారు.

అందులోభాగంగానే ఇటీవలే వెనుకబడిన జిల్లాలకు రూ. 450 కోట్లు విడుదల చేశారని గుర్తు చేశారు. వచ్చే బడ్జెట్లో విభజన చట్టంలో ఉన్న వాగ్ధానాలకు నిధులు ఇవ్వాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని కవిత డిమాండ్ చేశారు. హైకోర్టు ఏర్పాటు టీడీపీ వల్లే ఆలస్యం అవుతోందని కె. కవిత ఆరోపించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement