కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన టీఆర్‌ఎస్ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: రామప్ప ఆలయానికి రూ.250 కోట్లు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. భద్రాచలం ఆలయాన్ని ప్రసాద్ స్కీంలో చేర్చాలని, మేడారం జాతరకు జాతీయహోదా కల్పించి అభివృద్ధి చేయాలని విన్నవించారు. బుధవారం కేంద్రమంత్రిని కలిసిన టీఆర్‌ఎస్ ఎంపీలు పలు అంశాలపై చర్చించారు. మహబూబాబాద్ పర్యాటకంగా అభివృద్ధి చెంది, ప్రజల జీవన ప్రమాణాలు అభివృద్ది చెందాలంటే కేంద్రమంత్రిగా చొరవ తీసుకోవాలని, తెలంగాణబిడ్డగా పూర్తి సహకారం అందించాలని కిషన్‌రెడ్డిని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత కోరారు. రామప్ప ఆలయం యునెస్కో గుర్తింపు పొందడం దేశానికే గర్వకారణమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment