
కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా మలచండి
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో ఎంపీ వినోద్
సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీ జాబితాలో కరీంనగర్‌ను చేర్చాలని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడికి కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఇక్కడ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారితో కలిసి వెంకయ్యనాయుడితో ఈ అంశంపై చర్చించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. జాబితాలో చేరేందుకు కరీంనగర్ ప్రణాళికలో కొన్ని సంస్కరణలు అవసరమని, దీనిపై అధికారులకు సూచనలిచ్చిన ట్లు మంత్రి వెల్లడించారు.