ముంబై: తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ వేడుకలు ముంబైలో ఆదివారం ఘనంగా జరిగాయి. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్, జాగృతి అధ్యక్షురాలు, టీఆర్ఎస్ ఎంపీ కవిత, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే సతీమణి లక్ష్మీథాక్రే, పలువురు ఎమ్మెల్యేలు పాల్లొన్నారు. మహిళలతో కలిసి ఎంపీ కవిత, లక్ష్మీ థాక్రే ఉల్లాసంగా బతుకమ్మ ఆడారు. తీరొక్క పూలతో పేర్చిన అందమైన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ, లయబద్ధంగా చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడారు.