కోరుట్ల/మెట్‌పల్లి(కోరుట్ల): నిజాం చక్కెర ఫ్యాక్టరీల విషయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే మాటలను రైతులు నమ్మవద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. స్వాతంత్య్రం రాక ముందే నిజాం చక్కెర ఫ్యాక్టరీలను నిజాం ప్రభువులు ఏర్పాటు చేస్తే వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొల్పిందని జీవన్‌రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం వీటిని బీజేపీకి చెందిన మాజీ ఎంపీకి విక్రయించినప్పుడు ఆ సమయంలో కాంగ్రెస్ నాయకులు చోద్యం చూశా రా అని మండిపడ్డారు.
శనివారం జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత, కోరుట్ల బీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. బతుక మ్మ మీద గౌరమ్మ బదులు ఇంకేదో పెట్టు కొని పండుగ చేసుకుంటామని జీవన్‌రెడ్డి వ్యాఖ్యా నించడం ఆయన వయసుకి, హోదాకి తగదని కవిత చెప్పారు. ఎన్నికల్లో గెలవడానికి దిగజారి పోయి బతుకమ్మను అవమానించిన ఆయనను జగిత్యాల ప్రజలు తిరస్కరించడం ఖాయమ న్నారు.
నేడు మహారాష్ట్రకు కవిత
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఆదివారం జరిగే బతుకమ్మ సంబరాలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. అలాగే దత్తవాడ నుంచి సాయంత్రం ప్రారంభమయ్యే బతుకమ్మ శోభాయాత్రలో ఆమె పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment