
యాగంతోనైనా కేసీఆర్‌కు సద్బుద్ధి కలగాలి: గుత్తా
నల్లగొండ టూటౌన్: వక్రబుద్ధితో ఆలోచించి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు చండీయాగం వల్ల సద్బుద్ధి కలగాలని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆకాంక్షించారు. నల్లగొండలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అధర్మాన్ని కాపాడండి, అన్యాయాన్ని పెంచి పోషించండి’ అని యాగాలు చెబుతున్నాయా ? అందుకే కేసీఆర్ యాగం చేస్తున్నారా అని గుత్తా ప్రశ్నించారు. విశ్వశాంతి కోసం చండీయాగం చేస్తున్నానని చెబుతున్న ముఖ్యమంత్రి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందేందుకు అనైతికంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు.