
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో మంగళవారం జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై శాసన సభ్యులకు అవగహన కల్పించుటకు తెలంగాణ శాసనసభపక్షం భేటీ అయ్యింది. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతోంది. ఎన్నికలు జరిగే ఐదు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునే విధంగా సభ్యులు ఏలాంటి పొరపాట్లు చేయ్యకుండా వారికి మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఎంఐఎం కూడా హాజరైనట్లు తెలుస్తోంది.
లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలని పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించనున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సంబంధించి పార్టీ నేతలకు సీఎం దిశానిర్ధేశం చేయనున్నారు. 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే విధంగా వారికి సూచనలు చేయనున్నారు. అలాగే ఎన్నికల ప్రచారాన్ని ఈనెల 19న ఆయన కుమార్తె కవిత ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్ నుంచి ప్రారంభించన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment