మిషన్ భగీరథ పనులపై గవర్నర్ నరసింహన్ సమగ్రవిచారణకు ఆదేశించాలని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు
నల్లగొండ: మిషన్ భగీరథ పనులపై గవర్నర్ నరసింహన్ సమగ్రవిచారణకు ఆదేశించాలని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండలో విలేకరులతో ఆయన మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ గవర్నర్ మిషన్ భగీరథ పనులను సందర్శించి భేషుగ్గా ఉన్నాయని కితాబు ఇవ్వడాన్ని గుత్తా ఆక్షేపించారు. గవర్నర్‌కు ఎన్నికల కోడ్ వర్తించకపోయినా ఆ పనులను ఎన్నికల సమయంలో మెచ్చుకోవడాన్ని పరోక్షంగా ప్రభుత్వాన్ని సమర్ధించినట్లే అవుతుందన్నారు.
గవర్నర్ మిషన్ భగీరథ పునులపై విచారణకు ఆదేశించాలన్నారు. గ్రిడ్ పనుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని, పైపులైన్ల పనులకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన ఎస్టిమేట్లను తెప్పించుకుని కంపెనీలతో సంప్రదించి వాస్తవధరలను లెక్కకడితే ప్రభుత్వ బండారం బయటపడుతుందన్నారు.