మిషన్ భగీరథ పనులను పరిశీలించిన గవర్నర్ | governor narasimhan visits medak district | Sakshi
Sakshi News home page

మిషన్ భగీరథ పనులను పరిశీలించిన గవర్నర్

Published Wed, Jan 20 2016 12:51 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

governor narasimhan visits medak district

గజ్వేల్: మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ అటవీ ప్రాంతంలో గుట్టపై నిర్మిస్తున్న ఓవర్‌హెడ్ ట్యాంకు, వాటర్ గ్రిడ్ పథకం పనులను రాష్ట్ర గవర్నర్ నరసింహన్ బుధవారం మధ్యాహ్నం పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
 
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఈ పథకాన్ని రెండు మూడేళ్లలో పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారంటూ ప్రశంసించారు. ఈ పథకం పూర్తయితే అందరికీ సురక్షితమైన నీరు అందుతుందన్నారు. వచ్చే మూడేళ్లో రాష్ట్రమంతటా సంపూర్ణంగా తాగు నీరు అందుతుందన్నారు. ఈ పథకం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భగీరథ మ్యాప్‌ను వాటి పనితీరును జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌, ఆర్‌ డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ విజయ్‌ప్రకాష్‌ అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement