
గుత్తాకు పాలమూరు ప్రాజెక్టు కాంట్రాక్టు
అందుకే పార్టీని వీడారు: పాల్వాయి
సాక్షి, న్యూఢిలీ: పాల మూరు ప్రాజెక్టు కాం ట్రాక్ట్‌ను దక్కించుకున్నందుకే ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లోకి వెళుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మంగళవారం ఇక్కడ ఆరోపించారు. వృథా నీరంతా బయటకుపోతోందన్నారు. టీడీపీ అధికారం కోల్పోయాక పదవులు అనుభవించడానికే గుత్తా కాంగ్రెస్‌లో చేరారని, పార్టీని వాడుకుని ప్రస్తుతం బయటకు వెళ్తున్నారని విమర్శించారు.
గుత్తా వెళ్లినా కాంగ్రెస్‌కు నష్టం లేదని, కార్యకర్తలంతా పార్టీతోనే ఉన్నారని చెప్పారు. కొందరు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కోవర్టులుగా పనిచేస్తూ వందల కోట్ల రూపాయల కాంట్రాక్టులు సంపాదించారన్నారు. మరి కొందరు గిట్టుబాటు కోసం ఎదురుచూస్తున్నారని, కోవర్టులు వెంటనే పార్టీని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. పార్టీని వీడేవారు పదవులకు రాజీనామా చేయాలన్నారు.