నోట్ల రద్దుకు వ్యతిరేకం కాదు
Published Tue, Nov 29 2016 1:20 AM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM
పెద్దవూర : పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకం కాదని ప్రజల ఇబ్బందులను తొలగించడానికి కావాల్సిన కరెన్సీని ప్రవేశ పెట్టాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పులిచర్ల గ్రామంలో ఎన్‌ఆర్‌ఐ, టీఆర్‌ఎస్ నాయకుడు గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి-లక్ష్మి దంపతులు నిర్వహించిన శ్రీ హనుమాన్ గాయత్రి మహా యజ్ఞంలో పాల్గొనటానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి పెద్ద నోట్ల ఇబ్బందులపై 26 సలహాలు అందించినట్లు తెలిపారు. దేశంలో 90శాతం ప్రజలు ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి నిద్రపోయే వరకు డబ్బులు ఇచ్చిపుచ్చుకునే పరిస్థితి ఉందన్నారు.
టెలిఫోన్ విప్లవం వచ్చిందే గాని బ్యాంకుల విప్లవం సంపూర్తిగా రాలేదని అన్నారు. కుభేరుల వద్ద ఉన్న నల్లధనాన్ని వసూలు చేయటం మరిచి సామాన్య ప్రజలపై ఇబ్బందులు కలిగించవద్దని అన్నారు. 16 లక్షల 50 వేల కోట్ల కరెన్సీ చెలామణి అవుతుండగా అందులో 86 శాతం రూ.500, రూ.1000 నోట్లే ఉన్నాయని కేవలం 14 శాతమే మిగిలిన కరెన్సీ నోట్లు ఉన్నాయని అన్నారు. ఎక్కువ సంఖ్యలో ఉన్న నోట్లను రద్దు చేయడంతో దానికి సరిపోయే రూ.500 నోట్లను విడుదల చేసి తాత్కాలిక సమస్యను పరిష్కరించాలని కోరారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలలో నిల్వ ఉన్న నీటిలో ఏపీకి పోను తెలంగాణకు 103 టీఎంసీల నీరు ఉందని తెలి పారు. గత సీజన్‌లో ఖమ్మం జిల్లాకు కాకుండా కేవలం మొదటి జోన్‌కే ఆరుతడి పంటలకు నీరిచ్చామని తెలిపారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు నీరు ఇవ్వాలంటే ప్రస్తుతం 25 నుంచి 30టీఎంసీల నీరు లోటు ఉందని అన్నారు. దీనికి గాను వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆరుతడి పంటలకు ఆన్ అండ్ ఆఫ్ పద్దతిలో ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణరుుంచిందని అన్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నర్సిం హయ్య, ఎంపీపీ మల్లిక, ఎన్‌ఆర్‌ఐ గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి, వినయ్‌రెడ్డి, రవినాయక్, గాలి సైదిరెడ్డి, రవినాయక్ పాల్గొన్నారు.
Advertisement