
సాక్షి, నల్గొండ : అధికారం కోసం చంద్రబాబు నాయుడు ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారని టీఆర్‌ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుట్రలకు, మోసాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. కేసీఆర్ చంద్రబాబుపై మాట్లాడిన ప్రతి మాట సరైనదేనన్నారు. ఏపీ మంత్రులు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
హైకోర్టు విభజన చంద్రబాబుకు ఇష్టం లేదు కాబట్టే ఇన్ని రోజులు కోర్టు విభజనకు అడ్డుపడ్డారని ఆరోపించారు. రాజధాని ఏర్పాటు విషయంలో కూడా ఏపీ ప్రజలను మోసం చంద్రబాబు మోసం చేస్తున్నారని చెప్పారు. కులాలను అడ్డుపెట్టుకొని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు కుట్రలకు మళ్లీ బలి కావొద్దని ఏపీ ప్రజలను గుత్తా కోరారు.
Comments
Please login to add a commentAdd a comment