![KCR Finalised Naveen Rao Name For MLA Quota MLC Seat - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/27/Naveen-Rao-TRS.jpg.webp?itok=7JWunCHf)
సాక్షి, హైదరాబాద్ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి నవీన్‌రావు పేరును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. గత కొంతకాలంగా ఆ స్థానానికి నల్గొండ మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును ఖరారు చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఆఖరున నవీన్‌రావు పేరును ఖరారు చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మనసు నొచ్చుకోకుండా ఉండేందుకు.. త్వరలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానానికి అవకాశం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుండి మైనంపల్లి హన్మంతరావు టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి, విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవికి మైనంపల్లి హన్మంతరావు రాజీనామా చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవికి నోటిఫికేషన్ జారీ అయింది. నామినేషన్ దాఖలు చేయడానికి మంగళవారం చివరి తేదీ.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ స్థానానికి నవీన్‌రావు పేరు
Comments
Please login to add a commentAdd a comment