హైదరాబాద్ : రాష్ట్ర విభజన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీని నిందించటం తగదని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటానికే తెలంగాణ ప్రకటన చేసిందనటం అవాస్తవమన్నారు. విభజన విషయంలో ఇతర పార్టీలు మాటతప్పి కాంగ్రెస్ను నిందించటం సరికాదని గుత్తా వ్యాఖ్యానించారు.
సిడబ్ల్యూసీ సమావేశం అనంతరం ఓపికతో ఉండాలని అధిష్టానం పెద్దలు చెప్పారని.... అందుకే అప్పటి నుంచి ఓపిగ్గా ఉన్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ఆగదని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్, నీటి పంపిణీ విషయాలపై ఓ కమిటీ ఏర్పడుతుందన్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో త్వరలో కార్యచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు.