మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు గురువారం వచ్చిన రాష్ట్ర విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి కార్యక్రమంలో
హాలియా : మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు గురువారం వచ్చిన రాష్ట్ర విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి కార్యక్రమంలో జేబుదొంగలు చేతివాటం ప్రదర్శించారు. తిరుమలగిరి గ్రామంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి భూమిపూజ కార్యక్రమంలో బీజీగా ఉండగా, మండల ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకుల ఆసక్తిగా గమనించారు. మంత్రి పర్యటన సందర్భంగా గట్టి బందోబస్తు నిర్వహించేందుకు పోలీసులు అక్కడ ఉండగానే జేబు దొంగలు తమ పని కానిచ్చారు.
సుమారు రూ.18,500 కాజేశారు. స్థానికులు దుర్గారావు జేబులో రూ.7500, రమేశ్ దగ్గర రూ.8000, వీఆర్‌ఏ సత్రశాల నర్సింహా వద్ద రూ.3000, ఇరిగి నాగయ్య జేబులో రూ.200లు కాజేశారు. తమ జేబుకు చిల్ల్లుపడటంతో బాధితులు లబోదిబోమన్నారు.