న్యూఢిల్లీ: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ముద్దపప్పు అని విమర్శించిన నేపధ్యంలో ఆయన కొడుకు నారా లోకేష్ పందికొక్కా? అని కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. లోక్‌సభలో తెలుగుదేశం ఎంపీలు బూతు పురాణాన్ని అబ్బించుకున్నారని విమర్శించారు. తెలుగుజాతి గౌరవాన్ని దిగజార్చారని ఆరోపించారు.
ఎంపీల ప్రవర్తనపై చంద్రబాబు బహిరంగక్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీలపై అనర్హత వేటువేయాలని స్పీకర్‌కు ఫిర్యాదుచేసినట్లు సుఖేందర్ రెడ్డి చెప్పారు.
నారా లోకేష్ పందికొక్కా?: ఎంపి గుత్తా
Published Tue, Sep 3 2013 6:03 PM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM
Advertisement
Advertisement