సాక్షి, నల్గొండ : నియోజకవర్గ ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని, అందువల్లే తనకు 15 సంవత్సరాలు పూర్తి సమయం ఎంపీగా పని చేసే అదృష్టం లభించిందని టీఆర్‌ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ నిధులు పూర్తిగా శాశ్వత నిర్మాణాలకు కేటాయించి, నిధుల వినియోగంలో మొదటి స్థానంలో నిలవడం సంతోషంగా ఉందన్నారు. నల్గొండ, సూర్యాపేటలో మెడికల్ కళాశాలలు, నియోజకవర్గ పరిధిలో రెండు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు జాతీయ రహదారుల అనుసంధానం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
రైల్వే లైన్ల విషయంలో పెండింగ్ పనులు మార్చి చివరికల్లా పూర్తి చేయించడం జరుగుతుందని తెలిపారు. మార్చి మొదటి వారంలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చని చెప్పారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయించే దిశగా ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. ముఖ్యమంత్రి చేపడుతున్న పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment