
సాక్షి, నల్లగొండ : కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇక రిటైర్మెంట్ తీసుకుంటే మంచిది.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చదువుకున్న అజ్ఞాని.. కోమటిరెడ్డి చదువుకోని అజ్ఞాని.. ఇవి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యలు.. ఆయన సోమవారం నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు పగటి కలల్లో విహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చదువుకున్న అజ్ఞాని అయితే, కోమటిరెడ్డి చదువుకోని అజ్ఞాని అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పీసీసీ చీఫ్ కుటుంబంలో ఇద్దరు, కోమటిరెడ్డి కుటుంబంలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, వీరిదంతా ఫ్యామిలీ పార్టీ కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని విమర్శించారు.