
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు నష్టం
- ప్రధానికి ఎంపీ ‘గుత్తా’ లేఖ
నల్లగొండ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తే తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతుందని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను చేస్తున్న ఈ వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల జరిగే లాభనష్టాలను వివరిస్తూ ప్రధాని నరేంద్రమోదీకి రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో అక్షరాస్యత, పరిశ్రమల రంగాల్లో ముందంజలో ఉందన్నారు. కృష్ణా, గోదావరి డెల్టాలు కూడా ఏపీలో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కంపెనీలు ఏపీకి తర లించారని లేఖలో పేర్కొన్నారు.