letter to pm
-
కనీస మద్దతు ధర డిమాండ్ నెరవేర్చండి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నప్పటికీ రైతులు కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌పై ఇంకా వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ శనివారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. రైతుల కనీస మద్దతు ధర డిమాండ్ నెరవేర్చాలని, లఖీమ్‌పూర్ ఖేరి హింసలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై చర్యలు తీసుకోవాలని ప్రధానిని ఆయన కోరారు. రైతుల డిమాండ్లు నెరవేర్చేవరకు వారి పోరాటం ఆగదని పేర్కొన్నారు. మూడు వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయాన్ని ముందే తీసుకుని ఉండి ఉంటే 700 మంది రైతుల ప్రాణాలను కాపాడగలిగేవారని వ్యాఖ్యానించారు. మోదీకి రాసిన లేఖను వరుణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ‘రైతులు చేస్తున్న డిమాండ్లన్నీ నెరవేర్చేవరకు వారి ఉద్యమం ఆగదు. ఇప్పటికీ వారిలో ఆగ్రహావేశాలు ఉన్నాయి. అవి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రూపంలో బయటకి వస్తాయి. అందుకే కనీస మద్దతు ధరకి చట్ట బద్ధత కల్పించాలి’ అన్నారు. గత ఏడాదిగా జరిగిన రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి తలా రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని వరుణ్ డిమాండ్ చేశారు. వారిపై పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకోవాలన్నారు. రైతులు చేస్తున్న డిమాండ్లు ఇవే.. ► కనీస మద్దతు ధరకి చట్ట బద్ధత కల్పించాలి. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని అమలు చేయాలి. ► సంప్రదాయ ఆహార పంటల్ని కొనుగోలు చేస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వాలి ► మండీ వ్యవస్థను పరిరక్షించాలి ► విద్యుత్(సవరణ) బిల్లు–2020ను వెనక్కి తీసుకోవాలి. ► పంట వ్యర్థాల్ని తగలబెడుతున్నందుకు రైతులకు విధిస్తున్న జరిమానాలు, జైలు శిక్షలకు ఇకపై స్వస్తి పలకాలి. -
స్వచ్ఛంద మరణానికి అనుమతించండి
రాష్ట్రపతి, ప్రధానికి నెల్లూరు జిల్లా రైతు వేడుకోలు నెల్లూరు: 13 ఏళ్లుగా కొందరు వ్యక్తులు, అధికారులు పెడుతున్న ఇబ్బందుల నుంచి ఇప్పటికీ ఉపశమనం కలగకపోవడంతో తనకు స్వచ్ఛంద మరణానికి అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రపతికి, ప్రధానికి శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ రైతు వేడుకుంటున్నాడు. విడవలూరు మండలం ఊటుకూరుకు చెందిన రైతు కలిచేటి వెంకారెడ్డి శనివారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. తనకు ఊటుకూరులోని సర్వేనంబరు 817లో పెద్దల నుంచి సంక్రమించిన ఎకరా 80 సెంట్లలో కొబ్బరితోట ఉందన్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా కొందరు తన తోట చుట్టూ ఆక్వాసాగు చేయడంతోపాటు తన తోటలోకి నీరు రానీయకుండా, వెలుపలికి పోకుండా చేశారన్నారు. దీంతో ఏడాదికి రూ.60 వేలు ఆదాయం వచ్చే కొబ్బరితోట నిలువునా ఎండిపోయిందని వివరించారు. తనకు జరిగిన అన్యాయంపై 13 ఏళ్ల క్రితం నాటి కలెక్టరు నుంచి నేటి కలెక్టర్ వరకు, అధికారులకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు, ముఖ్యమంత్రులకు పలు పర్యాయాలు ఫిర్యాదు చేశానన్నారు. అయినా అధికారులు నామమాత్రంగా స్పందించారని వెంకారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పరిస్థితిలో తనకు, తన కుటుంబానికి చావే శరణ్యమన్నారు. దీంతో స్వచ్ఛంద మరణానికి అనుమతి ఇవ్వాలని, లేనిపక్షంలో తనను ఆదుకోవాలని కోరారు. కలిచేటి వెంకారెడ్డి -
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు నష్టం
- ప్రధానికి ఎంపీ ‘గుత్తా’ లేఖ నల్లగొండ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తే తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతుందని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను చేస్తున్న ఈ వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల జరిగే లాభనష్టాలను వివరిస్తూ ప్రధాని నరేంద్రమోదీకి రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో అక్షరాస్యత, పరిశ్రమల రంగాల్లో ముందంజలో ఉందన్నారు. కృష్ణా, గోదావరి డెల్టాలు కూడా ఏపీలో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కంపెనీలు ఏపీకి తర లించారని లేఖలో పేర్కొన్నారు. -
ప్రధానికి లేఖ రాసిన విజయమ్మ
-
దోషిగా నిలబడతారు
* ముందు తరాలు క్షమించవు * ‘విభజన’పై ప్రధానికి విజయమ్మ లేఖ * అధికారముందని తప్పుడు నిర్ణయం తీసుకుంటే రాష్ట్రం మనిషి చేసిన ఎడారిలా మారుతుంది * రాయలసీమ, ఆంధ్రల్లో ప్రజాప్రతినిధుల రాజీనామాలు, బంద్‌లు, సమ్మె జరుగుతున్నాయి * ఈ పరిస్థితుల్లో నూరు శాతం ఏకాభిప్రాయం తర్వాతే నిర్ణయమని ఎలా చెప్పగలుగుతారు? * షిండేకు రాసిన లేఖ, బహిరంగ లేఖలనూ ప్రధానికి పంపిన వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు సాక్షి, హైదరాబాద్: ‘‘అందరికీ ఆమోదయోగ్యంగా, ఎవరికీ అన్యాయం జరగకుండా, ఒక తండ్రిలా నిర్ణయం తీసుకోలేని పక్షంలో కేంద్రంలోని పాలకులు రాజ్యాంగం ద్వారా రాష్ట్రాన్ని విభజించే అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవటం ధర్మం కాదు.. రాష్ట్రాన్ని యథాతథంగా కొనసాగించటమే ధర్మం’’ అని పేర్కొంటూ వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ బుధవారం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుంటే.. తమకు అధికార బలం ఉంది కదా అని నిర్ణయం తీసుకుంటే.. ఈ రాష్ట్రం మనిషి చేసిన ఎడారిగా మారుతుందని హెచ్చరించారు. అలాంటి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని తరతరాలు దోషిగా పరిగణిస్తాయని విజయమ్మ తన లేఖలో స్పష్టంచేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై విజయమ్మ తాజాగా ప్రధానమంత్రికి లేఖ రాశారు. తమ పార్టీ అధ్యక్షుడు, తాను, ఇతర ప్రజా ప్రతినిధులంతా తమ పదవులకు ఎందుకు రాజీనామాలు చేయాల్సివచ్చిందో ఈ లేఖలో ప్రధానికి వివరించారు. రాష్ట్రంలో ఉన్న మూడు పార్టీలు - వైఎస్సార్ కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఐ (ఎం) - ఈ మూడు కూడా ఒకే మాట చెప్తున్నాయని.. న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని విడగొట్టవద్దు, యథాతథంగా కలిపే ఉంచండి.. అంటున్నాయని వివరించారు. రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒకవైపు రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేస్తున్నపుడు, ఆ రెండు ప్రాంతాల ప్రజలు, ఉద్యోగులు బంద్‌లు సమ్మెలు చేస్తున్నపుడు.. రాజకీయ పార్టీలన్నింటి మధ్య వంద శాతం ఏకాభిప్రాయం సాధించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ పార్టీ ఎలా చెప్పగలుగుతోందని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విడగొట్టటానికి ఒప్పుకున్నది తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, బీజేపీ - ఈ ఐదు పార్టీలు మాత్రమేనని, ఓట్ల కోసం సీట్ల కోసం అధికార పార్టీ అన్యాయం చేస్తూంటే.. ఓట్లు పోతాయని, సీట్లు పోతాయని, తమకు రావాల్సిన క్రెడిట్ రాకుండా పోతుందని ప్రతిపక్షంలో ఉన్న కొన్ని పార్టీలు విభజన ద్వారా జరిగే అన్యాయాన్ని గురించి స్పందించకుండా ఉంటే.. ఇక ఈ రాష్ట్రం తరఫున ఇక్కడి వారి గోడు ఎవరికి చెప్పుకోవాలని విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది అంటే... నెత్తిన తుపాకి పెట్టి ఒప్పుకుంటారా? చస్తారా? అని అడిగినట్లుగా ఉంది... ఒకవేళ అంగీకరించకపోయినా, మా ఇష్ట ప్రకారం మేం చెయ్యాలనుకున్నది చేస్తాం... అన్నట్లు ఉంది’’ అని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఇక్కడి రాజకీయ పార్టీల మధ్య దాదాపుగా నూరు శాతం ఏకాభిప్రాయం వచ్చింది అని కాంగ్రెస్ వారు చెప్పటం తప్పుదారి పట్టించటం కాదా? కేంద్రంలో ఉన్న వాళ్లు ఇలా ఎందుకు చెప్తున్నారో? ఇన్ని కోట్ల మంది మా రాష్ట్రాన్ని విడగొట్టొద్దు అని ప్రాధేయపడుతున్నా.. వీరందరి జీవితాలతో చెలగాటం ఆడటం న్యాయమేనా?’’ అని ప్రశ్నించారు. తమ రాజీనామా సందర్భంలో తాము విడుదల చేసిన లేఖను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నామని, దాన్ని చదవి ఇక్కడి సమస్యలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలని కోరారు. రాష్ట్రానికి సంబంధించి ఏకపక్షంగా నిర్ణయం చేయకుండా ఇరు ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా నిర్ణయం ఉండాలని కోరుతూ గత నెల 16న కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండేకు పార్టీ తరఫున రాసిన లేఖను, అలాగే సీడబ్ల్యూసీ సమావేశానికి ఒక రోజు ముందు జూలై 29న.. అడ్డగోలు విభజన వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులను వివరిస్తూ బహిరంగ లేఖ ద్వారా వైఎస్సార్ సీపీ తెలియజేసిన వివరాలను విజయమ్మ తన లేఖతో పాటు పొందుపరిచారు. -
చంద్రబాబుపై మండిపడ్డ టీఆర్ఎస్ నేత వినోద్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై టీఆర్ఎస్ నేత వినోద్ శనివారం హైదరాబాద్‌లో మండిపడ్డారు. ప్రధాని మన్మోహన్ సింగ్‌కు చంద్రబాబు లేఖ రాయడాన్ని కుట్రపూరితమైన చర్యగా ఆయన అభివర్ణించారు. సీమాంధ్ర ప్రజలపై చంద్రబాబుకు ప్రేమ లేదన్నారు. రాజాధికారం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వినోద్ ఆరోపించారు. గతంలో అన్నీ పార్టీలు తెలంగాణా ప్రత్యేక రాష్ట ఏర్పాటుకు సానుకూలంగానే స్పందించాయని బాబు ప్రధానికి రాసిన లేఖలో గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిర్ణయంతో సీమాంధ్రలో నిరసన జ్వాలలు ఉప్పెనలా ఎగసిపడుతున్నాయని చంద్రబాబు ఆ లేఖలో వివరించారు. అంతేకాకుండా డిసెంబర్ 9 తర్వాత రాష్టంలో పరిస్థితుల్లో ఒక్కసారిగా మార్పులు వచ్చాయన్నారు. అలాగే ప్రత్యేక రాష్టం ఏర్పాటుతో సీమాంధ్రకు జరుగనున్న అన్యాయాన్ని ప్రధానికి రాసిన లేఖలో చంద్రబాబు వెల్లడించారు.