తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తయిందన్నారు.
కొండమల్లెపల్ల్లి, న్యూస్‌లైన్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తయిందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ఆపలేరన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యం జరిగిన మాట వాస్తవమే అన్నారు. గతంలో బీజేపీని, నరేంద్రమోడీని విమర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పుడు వారితో పొత్తుకు ప్రయత్నించడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం పదవికోసమే ఆయన వెంపర్లాడుతున్నారని పేర్కొన్నారు. సొనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలునాయక్, కాంగ్రెస్ నాయకులు మేకల శ్రీను, కేసాని లింగారెడ్డి, సాయి, యాదగిరి పాల్గొన్నారు.