
'గుత్తా పార్లమెంట్ సభ్యత్వం రద్దయ్యే వరకు పోరాటం'
ఆదిలాబాద్ : నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పార్లమెంట్ సభ్యత్వం రద్దయ్యే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని... ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. గురువారం ఆదిలాబాద్లో దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ... తెలంగాణ కేబినెట్లో మాల, మాదిగ, మహిళలకు స్థానం కల్పించకపోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారని దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు.