సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని తాను భావిస్తున్నానని, ముందస్తు వచ్చే అవకాశం లేదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ముందస్తుకు వెళ్లేంత సమయం కూడా లేదని, మధ్యలో కేవలం ఆరు నెలలే గడువు ఉందన్నారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
భవిష్యత్తు ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి ముందుకు వెళ్లాలని మునుగోడు ఎన్నికల సమయంలో అవగాహన కుదిరినట్లు తమ పార్టీ వారు తనకు చెప్పారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని, హంగ్ వస్తుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దండుపాళ్యం బ్యాచ్ అని చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నాయకులకే వర్తిస్తా యని విమర్శించారు. కేసీఆర్ సాధించిన ప్రగతే బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మళ్లీ పట్టం కడుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment