
ముక్కు నేలకు రాస్తా
రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన రెండు పడక గదుల ఇళ్లు ఎక్కడైనా నిర్మించినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని ...
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన రెండు పడక గదుల ఇళ్లు ఎక్కడైనా నిర్మించినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సవాల్ విసిరారు. సోమవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇవి పత్రికల్లోనే కనిపిస్తున్నాయి తప్ప.. ఆచరణలో శూన్యమన్నారు.
అవినీతి జరిగిందన్న సాకుతో ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం నిలిపేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇందిరమ్మ కాలనీలో చేపట్టిన మౌలిక సదుపాయాలకు చెల్లించాల్సిన బిల్లులు కూడా ఆపేశారని తెలిపారు. దీంతో చిలుకూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి తాను ఆత్మహత్య చేసుకుంటానని సెల్‌ఫోన్‌లో ఎస్‌ఎంఎస్ పంపాడన్నారు.