
కేటీఆర్ ...నోరు పారేసుకోవద్దు
హైదరాబాద్: తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్‌ను నోరు పారేసుకోవద్దని, వ్యక్తిగత దూషణలకు దిగవద్దని ఆయన సూచించారు. కేసీఆర్ సర్కార్కు కాంగ్రెస్ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. అయినా కాంగ్రెస్‌పై మంత్రులు ఎదురుదాడి చేయడం సరికాదన్నారు.
కాంగ్రెస్ హయాంలో అసలు అభివృద్ధే జరగలేదని, నేతలంతా ఒళ్లు పెంచారని మంత్రి కేటీఆర్ సంస్కారం లేకుండా మాట్లాడారన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా అదనంగా గ్రామాలకు ఒక్క చుక్కతాగునీరు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఉండేలా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ చేపట్టాలని సూచించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ నుంచే వలసలు ప్రోత్సహించడం కేసీఆర్‌కే సాపమన్నారు. అన్నం పెట్టిన తల్లి సోనియాకు కేసీఆర్ ద్రోహం చేస్తున్నారని గుత్తా విమర్శించారు.