'సంక్షోభంలో తెలంగాణ నెంబర్ వన్'
'సంక్షోభంలో తెలంగాణ నెంబర్ వన్'
Published Mon, Aug 15 2016 2:19 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగం పచ్చి అబద్ధాల పుట్ట అని మాజీ ఎంపీ మధుయాష్కి విమర్శించారు. ఆయనిక్కడ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ గాలికి వదిలేశారని, కేసీఆర్ పాలనే తెలంగాణకు అరిష్టమన్నారు. సంక్షోభంలో తెలంగాణ ప్రభుత్వమే నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. మిషన్ భగీరథ దేశంలో భారీ కుంభకోణం అని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ సన్న బియ్యం, నల్లా నీళ్ల కోసమే వచ్చిందా అని ప్రశ్నించారు. కేసీఆర్ బిడ్డ కవిత లాండ్ సెటిల్ మెంట్స్, అల్లుడు ఇసుక దోపిడీ, కొడుకు ప్రత్యేక విమానాల్లో షికారు చేస్తూ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారని అన్నారు.
మహారాష్ట్రతో ఒప్పందం జరిగిపోయినట్లు గతంలో ప్రచారం చేసిన టీఆర్‌ఎస్ నాయకులను గాడిదలపై ఊరేగించాలన్నారు. కేసీఆర్ సన్నిహితునితో సెటిల్‌మెంట్ చేసినందుకే నయీంను ఎన్‌కౌంటర్ చేశారని అన్నారు. కేసీఆర్, కులగజ్జితో కేవీపీతో కుమ్మక్కయ్యారని అన్నారు. కేవీపీతో కలిసి కేసీఆర్ ఫ్యామిలీ బినామీ వ్యాపారాలు చేస్తోందని ఆరోపించారు. కేవీపీపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
Advertisement
Advertisement