బెటాలియన్ అభివృద్ధికి తోడ్పడతా
Published Mon, Aug 26 2013 4:09 AM | Last Updated on Thu, Aug 9 2018 4:48 PM
సాక్షి, నల్లగొండ :అన్నెపర్తిలోని 12వ బెటాలియన్ అభివృద్ధికి అన్ని విధాలా తన తోడ్పాటునందిస్తానని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రం సమీపంలోని అన్నెపర్తి 12వ బెటాలియన్‌లో సెంట్రీ పోస్ట్, విచారణ కేంద్రాన్ని ఎంపీ గుత్తా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బెటాలియన్‌లో కమ్యూనిటీ వెల్ఫేర్ సెంటర్ నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ బెటాలియన్‌ను రాష్ట్రంలోకెల్లా మోడల్ బెటాలియన్‌గా తీర్చిదిద్దారని సిబ్బందిని ఆయన ప్రశంసించారు.
బెటాలియన్‌లో పనిచేస్తున్న సిబ్బందంతా సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. బెటాలియన్ అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు ఎంపీ గుత్తా, ఎమ్మెల్యే వెంకట్‌రెడ్డి ఎంతో సహకరించారని కమాండెంట్ ఎస్‌ఎన్‌బీ శేఖర్ బాబూజీ తెలిపారు. ఈ సేవలను ఇకపై కూడా కొనసాగించాలని ఆయన కోరారు. కార్యక్రమం లో అదనపు కమాండెంట్ కేఎన్ బాలా జీ, మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణ గౌడ్, గుమ్మల మోహన్‌రెడ్డి, పుష్పలత, భూ పాల్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, ముని స్వామి, మోహన్‌రావు, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement