
కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధి లేదు: గుత్తా
నల్గొండ: రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర కూడా పోషించే స్థితిలో కాంగ్రెస్ నేతలు లేరని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి కృష్ణా నీళ్లు విడుదల చేసేలా కృషి చేయాలన్నారు.కర్ణాటక ప్రభుత్వం దర్భుద్దితోనే కృష్ణా నీటిని విడుదల చేయడం లేదని ఆరోపించారు.
స్థానిక కాంగ్రెస్ నేతలు కర్ణాటక ప్రభుత్వాన్ని నీళ్ల గురించి అడగడం లేదని, నాగర్జున సాగర్‌లో నీళ్లు లేకున్నా నోరు మెదపకుండా వ్యక్తిగత పంచాయితీలపై శ్రద్ద వహిస్తున్నారని ఎద్దేవ చేశారు.ఈ విషయంపై నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాశారని ఆయన పేర్కొన్నారు.