
రాష్ట్రం ఇచ్చింది రాజకీయు లబ్ధికోసం కాదు
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్
శంషాబాద్, రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను గుర్తించే యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి పేరు మార్చే యోచన సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.