
‘సీఎం పనులు సచివాలయం దాటవా’
హైదరాబాద్: రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెబుతున్న మాటలు సమీక్షలకే పరిమితమయ్యాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నా పనులు మాత్రం సచివాలయం గేటు దాటడం లేదని ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ఎంపీ కవిత దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరూ పట్టించుకోలేదు కాని, తమ ఎమ్మెల్యే లక్ష్మణ్ సానియాపై చేసిన వ్యాఖ్యలపై రాద్ధాంతం చేశారని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వచ్చేనెలలో రాష్ట్రానికి వస్తున్నారని, పార్టీ బలోపేతానికి రెండురోజుల పాటు భేటీలు నిర్వహించి మార్గదర్శనం చేయనున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు.