టీఎన్జీవో అధ్యక్షుడిగా దేవీప్రసాద్
ప్రధాన కార్యదర్శిగా కె.రవీందర్‌రెడ్డి ఏకగ్రీవంగా కార్యవర్గం ఎన్నిక
హైదరాబాద్: తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) అధ్యక్షుడిగా దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కె.రవీందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయడానికి ఆఖరు తేదీ 14వ తేదీ నాటికి ఒక్కొక్క సెట్ నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటించా రు. అనంతరం కార్యవర్గాన్ని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2012 జూలై 31న స్వామిగౌడ్ పదవీ విరమణ చేయడంతో దేవీప్రసాద్ టీఎన్జీవోల అధ్యక్షుడిగా తొలిసారి ఎన్నికైన విషయం విదితమే. ఈ ఎన్నికలను ప్రతి మూడేళ్లకోసారి నిర్వహిస్తారు. కాగా ఈ సందర్భంగా దేవీప్రసాద్ ఉద్యోగులను ఉద్దేశించి మా ట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిం చిన ఉద్యోగులు.. సొంత రాష్ట్రంలో పీఆర్సీ, హెల్త్‌కార్డులు, సకల జనుల సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా గుర్తించడం తదితర డిమాండ్ల సాధనకు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలోఉన్న సీమాంధ్ర ఉ ద్యోగులందరినీ వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గం..
అధ్యక్షుడిగా దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కారం రవీందర్‌రెడ్డి, సహాధ్యక్షుడుగా ఎం.రాజేందర్ (మెదక్), ఉపాధ్యక్షులుగా ఎం.ఉపేందర్‌రెడ్డి, రేచల్, ఎం.జగదీశ్వర్, ఎస్.కె.హస్నుద్దీన్ (వరంగల్), ఆర్.విజయలక్ష్మి, ఈ.వెంకటేశ్వర్లు (వరంగల్), బి.బుచ్చిరెడ్డి, కార్యదర్శులుగా బి.శంకర్, టి.దయానంద్, ఎ.నారాయణరెడ్డి, ఎస్.వెంకటేశ్వర్లు, పి.సత్తెమ్మ, పి.లక్ష్మీనారాయణ, ఎం.హరిబాబు, విజేత, ఆర్.శైలజాదేవి, కోశాధికారిగా వేణుగోపాల్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ఆర్.శ్రీనివాసరావు, ఎస్.జీవన్‌రావు, ప్రచార కార్యదర్శిగా ఆర్.ప్రతాప్, కార్యవర్గ సభ్యులుగా సి.హెచ్.మనోహర, భవానీసింగ్, వి.సుధాకర్, బి.మల్లేష్, జె.నర్సింగరావు, అమృత్‌కుమార్, కె.యాదయ్య, బి.రాము, ఇ.కొండల్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ కార్యవర్గాన్ని ఎన్నికల అధికారులు గురువారం అధికారికంగా ప్రకటించనున్నారు.