devisriprasad
-
దేవిశ్రీని పట్టుకోండి...
‘‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీసిన చిత్రమిది. మన దేశంలో ఇంతకు ముందెప్పుడూ ఇటువంటి కాన్సెప్ట్‌తో సిన్మా రాలేదు. ఒకవేళ.. ఎవరైనా వచ్చిందని నిరూపిస్తే, వారికి ఐదు లక్షల నగదు బహుమతి ఇస్తాం’’ అని సవాల్ విసిరారు నిర్మాత డి. వెంకటేశ్. పూజా రామచంద్రన్, భూపాల్ రాజు, ధనరాజ్, మనోజ్ నందం ముఖ్య తారలుగా శ్రీకిశోర్ దర్శకత్వంలో డి. వెంకటేశ్, ఆర్వీ రాజు, ఆక్రోశ్ నిర్మించిన సినిమా ‘దేవిశ్రీ ప్రసాద్’. ఈ నెల 24న సినిమా విడుదలవుతోంది. డి. వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘గతంలో భారతీయ తెరపై రాని కథను సినిమాగా మలచడం దర్శకుడి తెలివితేటలకు నిదర్శనం. వచ్చిందంటారా? దేవిశ్రీని పట్టుకోండి... ఐదు లక్షలు గెలుచుకోండి! కొత్తదనం కోరుకునే తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా మా సినిమా నచ్చుతుంది. సుమారు 200 థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. పోసాని కృష్ణమురళి, టిల్లు వేణు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: కమ్రాన్, లైన్ ప్రొడ్యూసర్: చంద్ర వట్టికూటి. -
శ్రమ ఆయుధమైతే విజయమే బానిస
-2 హైస్కూళ్లలో సత్యమూర్తి ఫౌండేషన్ డిజిటల్ తరగతులు -ప్రారంభించిన ఎమ్మెల్యే వేగుళ్ల రాయవరం (మండపేట) : ‘శ్రమ మీ ఆయుధమైతే విజయం మీ బానిస’ అవుతుందని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. మండలంలోని వెదురుపాక, రాయవరం జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో శ్రీసత్యమూర్తి ఫౌండేషన్ పేరిట ప్రముఖ రచయిత, దివంగత సత్యమూర్తి కుమారులు సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్, నేపథ్య గాయకుడు సాగర్ ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతులను మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు కొండిపూడి సత్యప్రభఏసురత్నం, పాలింగి చినబాబుల అధ్యక్షతన నిర్వహించిన సభల్లో ఎమ్మెల్యే వేగుళ్ల, దేవీశ్రీప్రసాద్, సాగర్, జెడ్పీటీసీ చిన్నం అపర్ణాపుల్లేష్ మాట్లాడారు. డిజిటల్ తరహాలో సాగే బోధనను సద్వినియోగం చేసుకుని విద్యాభివృద్ధిని సాధించాలని సూచించారు. అనంతరం ముగ్గురు మెరిట్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5 వేల వంతున నగదు బహుమతితో పాటు మెమెంటోలను, ఉన్నత పాఠశాల విద్యార్థులకు డిక్షనరీలను అందజేశారు. ఆచంట రాంబాబు సౌజన్యంతో 40 మంది మెయిన్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్‌లు అందజేశారు. ఉప సర్పంచ్ తమలంపూడి గంగాధరరెడ్డి, వైస్ ఎంపీపీ సత్తి హిమరాణిసావిత్రిదేవి, సొసైటీ డైరెక్టర్ సత్తి శ్రీనివాసరెడ్డి, డోనర్స్ క్లబ్ సభ్యుడు ఆచంట రాంబాబు, పాఠశాల హెచ్ఎం శాంతిసునీత తదితరులు పాల్గొన్నారు. రక్తదాతలకు సత్కారం రక్తదానం చేస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్న వారిని రాయవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో సత్కరించారు. వలంటరీ బ్లడ్ డోనర్స్ క్లబ్ చైర్మన్ వెలగల ఫణికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 50 మంది రక్తదాతలను మెమెంటోలతో ఎమ్మెల్యే జోగేశ్వరరావు, దేవీశ్రీప్రసాద్, సాగర్ సత్కరించారు. -
లింబో స్కేటింగ్‌లో బాలుడి రికార్డు
తిరుపతి స్పోర్ట్స్: తిరుపతికి చెందిన దేవిశ్రీప్రసాద్(8) లింబో స్కేటింగ్‌లో మరో రికార్డు నెలకొల్పాడు. దీన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో నమోదు చేసేందుకు ప్రతినిధులకు పంపారు. తిరుపతి సిల్వర్ బెల్స్ సెంట్రల్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న దేవిశ్రీప్రసాద్ బుధవారం ఫార్వార్డ్ లింబోస్కేటింగ్‌లో 53 సుమోల కింద 100 మీ. దూరాన్ని 17.84 సెకన్లలో చేరుకుని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. బ్యాక్వార్డ్ (వెనక్కు) లింబోస్కేటింగ్లోనూ 53 సుమోల కింద 100 మీ. దూరాన్ని 22.03 సెకన్లలో చేరుకుని గత రికార్డులను తిరగరాశాడు. మరోవైపు అండర్ బార్స్ ఫార్వార్డ్ (ముందుకు) లోయస్ట్, లాంగెస్ట్ లింబో స్కేటింగ్‌లోనూ రికార్డు సృష్టించాడు. 113 కమ్మీల కింద 8.75 అంగుళాల ఎత్తులో 100.4 మీ. దూరాన్ని 15.4 సెకన్లలో చేరుకుని గిన్నిస్ రికార్డును తిరగరాశాడు. -
దటీజ్ దేవిశ్రీప్రసాద్
తిరుపతి: నగరానికి చెందిన దేవిశ్రీప్రసాద్ (8) లింబో స్కేటింగ్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. స్థానిక ఓ ప్రైవేటు స్కూల్లో 4వ తరగతి చదువుతున్న అతను స్కేటింగ్ శిక్షణ పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం వేదిక్ యూనివర్సిటీ వద్ద 103.7 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన 50 సుమో వాహనాల కింద 8.5 ఇంచ్‌ల ఎత్తులో ముందుకు(ఫార్వర్డ్) స్కేటింగ్ చేస్తూ, కేవలం 19.27 సెకండ్లలో గత ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. గతంలో తమిళనాడుకు చెందిన ఐజెక్ హెండ్రీ అనే క్రీడాకారుడు 102 మీటర్ల దూరం లో ఏర్పాటు చేసిన 42 సుమోల కింద ముందుకు(ఫార్వర్డ్) 27.4 సెకండ్లలో ఈ రికార్డు సాధించగా దేవిశ్రీప్రసాద్ అధిగమించాడు. ఇదే స్కేటింగ్‌లోనే వెనక్కి(బ్యాక్వర్డ్) 53.8 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన 26 సుమోల కింద 27.98 సెకండ్లలో చేరుకుని సత్తా చూపాడు. ఈ వీడియో రికార్డులను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ల పరిశీలనకు పంపనున్నారు. ప్రపంచ రికార్డుతో ఒకే రోజూ ఏడు సంస్థల గుర్తింపు పొందిన దేవిశ్రీప్రసాద్‌కి ప్రతిష్టాత్మకమైన ‘మ్యాన్ ఆఫ్ ది రికార్డు-2015’ అవార్డును ప్రకటించారు. -
దేశానికే కేంద్ర బిందువులా తెలంగాణ
టీ జేఏసీ చైర్మన్ కోదండరాం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం దేశ పటంలో కేంద్ర బిందువులా ఉందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో భారతదేశ మ్యాప్‌లో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని పొందుపర్చిన నమూనా మ్యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. మన రాష్ర్టం మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు కూడలిగా ఉందన్నారు. ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు వ్యాపార కేంద్రంగా ఉంటుందని, దాన్ని దృష్టిలో ఉంచుకొని రవాణ వ్యవస్థను పెంపొందించుకుంటే వ్యాపారాన్ని విస్తరించవచ్చన్నారు. గోదావరి, ప్రాణహితకు వంతెనలు నిర్మిస్తే అశేష అవకాశాలు లభిస్తాయన్నారు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమకు మంచి భవిష్యత్తు ఉంటుందని, రామగుండం నుంచి కాగజ్‌నగర్ వరకు పారిశ్రామికవాడలుగా మార్చుకునేందుకు అనువైన ప్రదేశంగా ఉందన్నారు. టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణను మిగతా రాష్ట్రాల కన్నా అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు శ్రమించాలని కోరారు. సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని 29వ రాష్ట్రంగా దేశ చిత్రపటంలో నమోదు చేయడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. -
టీఎన్జీవో అధ్యక్షుడిగా దేవీప్రసాద్
ప్రధాన కార్యదర్శిగా కె.రవీందర్‌రెడ్డి ఏకగ్రీవంగా కార్యవర్గం ఎన్నిక హైదరాబాద్: తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) అధ్యక్షుడిగా దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కె.రవీందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయడానికి ఆఖరు తేదీ 14వ తేదీ నాటికి ఒక్కొక్క సెట్ నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటించా రు. అనంతరం కార్యవర్గాన్ని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2012 జూలై 31న స్వామిగౌడ్ పదవీ విరమణ చేయడంతో దేవీప్రసాద్ టీఎన్జీవోల అధ్యక్షుడిగా తొలిసారి ఎన్నికైన విషయం విదితమే. ఈ ఎన్నికలను ప్రతి మూడేళ్లకోసారి నిర్వహిస్తారు. కాగా ఈ సందర్భంగా దేవీప్రసాద్ ఉద్యోగులను ఉద్దేశించి మా ట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిం చిన ఉద్యోగులు.. సొంత రాష్ట్రంలో పీఆర్సీ, హెల్త్‌కార్డులు, సకల జనుల సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా గుర్తించడం తదితర డిమాండ్ల సాధనకు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలోఉన్న సీమాంధ్ర ఉ ద్యోగులందరినీ వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గం.. అధ్యక్షుడిగా దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కారం రవీందర్‌రెడ్డి, సహాధ్యక్షుడుగా ఎం.రాజేందర్ (మెదక్), ఉపాధ్యక్షులుగా ఎం.ఉపేందర్‌రెడ్డి, రేచల్, ఎం.జగదీశ్వర్, ఎస్.కె.హస్నుద్దీన్ (వరంగల్), ఆర్.విజయలక్ష్మి, ఈ.వెంకటేశ్వర్లు (వరంగల్), బి.బుచ్చిరెడ్డి, కార్యదర్శులుగా బి.శంకర్, టి.దయానంద్, ఎ.నారాయణరెడ్డి, ఎస్.వెంకటేశ్వర్లు, పి.సత్తెమ్మ, పి.లక్ష్మీనారాయణ, ఎం.హరిబాబు, విజేత, ఆర్.శైలజాదేవి, కోశాధికారిగా వేణుగోపాల్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ఆర్.శ్రీనివాసరావు, ఎస్.జీవన్‌రావు, ప్రచార కార్యదర్శిగా ఆర్.ప్రతాప్, కార్యవర్గ సభ్యులుగా సి.హెచ్.మనోహర, భవానీసింగ్, వి.సుధాకర్, బి.మల్లేష్, జె.నర్సింగరావు, అమృత్‌కుమార్, కె.యాదయ్య, బి.రాము, ఇ.కొండల్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ కార్యవర్గాన్ని ఎన్నికల అధికారులు గురువారం అధికారికంగా ప్రకటించనున్నారు.