శ్రమ ఆయుధమైతే విజయమే బానిస
శ్రమ ఆయుధమైతే విజయమే బానిస
Published Mon, Jul 10 2017 11:06 PM | Last Updated on Tue, Sep 5 2017 3:42 PM
-2 హైస్కూళ్లలో సత్యమూర్తి ఫౌండేషన్ డిజిటల్ తరగతులు
-ప్రారంభించిన ఎమ్మెల్యే వేగుళ్ల
రాయవరం (మండపేట) : ‘శ్రమ మీ ఆయుధమైతే విజయం మీ బానిస’ అవుతుందని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. మండలంలోని వెదురుపాక, రాయవరం జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో శ్రీసత్యమూర్తి ఫౌండేషన్ పేరిట ప్రముఖ రచయిత, దివంగత సత్యమూర్తి కుమారులు సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్, నేపథ్య గాయకుడు సాగర్ ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతులను మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు కొండిపూడి సత్యప్రభఏసురత్నం, పాలింగి చినబాబుల అధ్యక్షతన నిర్వహించిన సభల్లో ఎమ్మెల్యే వేగుళ్ల, దేవీశ్రీప్రసాద్, సాగర్, జెడ్పీటీసీ చిన్నం అపర్ణాపుల్లేష్ మాట్లాడారు. డిజిటల్ తరహాలో సాగే బోధనను సద్వినియోగం చేసుకుని విద్యాభివృద్ధిని సాధించాలని సూచించారు. అనంతరం ముగ్గురు మెరిట్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5 వేల వంతున నగదు బహుమతితో పాటు మెమెంటోలను, ఉన్నత పాఠశాల విద్యార్థులకు డిక‌్షనరీలను అందజేశారు. ఆచంట రాంబాబు సౌజన్యంతో 40 మంది మెయిన్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్లు అందజేశారు. ఉప సర్పంచ్ తమలంపూడి గంగాధరరెడ్డి, వైస్ ఎంపీపీ సత్తి హిమరాణిసావిత్రిదేవి, సొసైటీ డైరెక్టర్ సత్తి శ్రీనివాసరెడ్డి, డోనర్స్ క్లబ్ సభ్యుడు ఆచంట రాంబాబు, పాఠశాల హెచ్‌ఎం శాంతిసునీత తదితరులు పాల్గొన్నారు.
రక్తదాతలకు సత్కారం
రక్తదానం చేస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్న వారిని రాయవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో సత్కరించారు. వలంటరీ బ్లడ్ డోనర్స్ క్లబ్ చైర్మన్ వెలగల ఫణికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 50 మంది రక్తదాతలను మెమెంటోలతో ఎమ్మెల్యే జోగేశ్వరరావు, దేవీశ్రీప్రసాద్, సాగర్ సత్కరించారు.
Advertisement