దేవిశ్రీని పట్టుకోండి... | Devi Sri Prasad Movie Press Meet | Sakshi
Sakshi News home page

దేవిశ్రీని పట్టుకోండి...

Nov 20 2017 12:27 AM | Updated on Nov 20 2017 12:27 AM

Devi Sri Prasad Movie Press Meet  - Sakshi

‘‘డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తీసిన చిత్రమిది. మన దేశంలో ఇంతకు ముందెప్పుడూ ఇటువంటి కాన్సెప్ట్‌తో సిన్మా రాలేదు. ఒకవేళ.. ఎవరైనా వచ్చిందని నిరూపిస్తే, వారికి ఐదు లక్షల నగదు బహుమతి ఇస్తాం’’ అని సవాల్‌ విసిరారు నిర్మాత డి. వెంకటేశ్‌. పూజా రామచంద్రన్, భూపాల్‌ రాజు, ధనరాజ్, మనోజ్‌ నందం ముఖ్య తారలుగా శ్రీకిశోర్‌ దర్శకత్వంలో డి. వెంకటేశ్, ఆర్వీ రాజు, ఆక్రోశ్‌ నిర్మించిన సినిమా ‘దేవిశ్రీ ప్రసాద్‌’. ఈ నెల 24న సినిమా విడుదలవుతోంది.

డి. వెంకటేశ్‌ మాట్లాడుతూ– ‘‘గతంలో భారతీయ తెరపై రాని కథను సినిమాగా మలచడం దర్శకుడి తెలివితేటలకు నిదర్శనం. వచ్చిందంటారా? దేవిశ్రీని పట్టుకోండి... ఐదు లక్షలు గెలుచుకోండి! కొత్తదనం కోరుకునే తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా మా సినిమా నచ్చుతుంది. సుమారు 200 థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. పోసాని కృష్ణమురళి, టిల్లు వేణు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: కమ్రాన్, లైన్‌ ప్రొడ్యూసర్‌: చంద్ర వట్టికూటి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement