Manojnandam
-
దేవిశ్రీని పట్టుకోండి...
‘‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీసిన చిత్రమిది. మన దేశంలో ఇంతకు ముందెప్పుడూ ఇటువంటి కాన్సెప్ట్‌తో సిన్మా రాలేదు. ఒకవేళ.. ఎవరైనా వచ్చిందని నిరూపిస్తే, వారికి ఐదు లక్షల నగదు బహుమతి ఇస్తాం’’ అని సవాల్ విసిరారు నిర్మాత డి. వెంకటేశ్. పూజా రామచంద్రన్, భూపాల్ రాజు, ధనరాజ్, మనోజ్ నందం ముఖ్య తారలుగా శ్రీకిశోర్ దర్శకత్వంలో డి. వెంకటేశ్, ఆర్వీ రాజు, ఆక్రోశ్ నిర్మించిన సినిమా ‘దేవిశ్రీ ప్రసాద్’. ఈ నెల 24న సినిమా విడుదలవుతోంది. డి. వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘గతంలో భారతీయ తెరపై రాని కథను సినిమాగా మలచడం దర్శకుడి తెలివితేటలకు నిదర్శనం. వచ్చిందంటారా? దేవిశ్రీని పట్టుకోండి... ఐదు లక్షలు గెలుచుకోండి! కొత్తదనం కోరుకునే తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా మా సినిమా నచ్చుతుంది. సుమారు 200 థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. పోసాని కృష్ణమురళి, టిల్లు వేణు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: కమ్రాన్, లైన్ ప్రొడ్యూసర్: చంద్ర వట్టికూటి. -
ఈ సినిమాను 13 మంది హీరోయిన్లు రిజెక్ట్ చేశారు!
‘‘మా సినిమా టీజర్, ట్రైలర్ చూసినోళ్లు... ‘శవాన్ని రేప్ చేయడం ఏంటి? ఇదొక వల్గర్ సిన్మా’ అన్నారు. సినిమా చూస్తే... ఎక్కడా వల్గారిటీ కనపడదు. మాది యూత్ సినిమానే... బూతు సినిమా కాదు’’ అన్నారు ధనరాజ్. శ్రీ కిశోర్ దర్శకత్వంలో డి. వెంకటేశ్, ఆర్వీ రాజు, ఆక్రోశ్ నిర్మించిన సినిమా ‘దేవిశ్రీ ప్రసాద్’. పూజా రామచంద్రన్, భూపాల్, ధనరాజ్, మనోజ్ నందం ముఖ్య తారలు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా గురించి ధనరాజ్ మాట్లాడుతూ– ‘‘ఇందులో మార్చురీ వ్యాన్ డ్రైవర్ ‘శ్రీ’ పాత్రలో నటించాను. ధనరాజ్ ఏ పాత్ర అయినా చేయగలడనే మంచి పేరొస్తుంది. ఈ సినిమా కథంతా ఆరు పాత్రల చుట్టూ తిరుగుతుంది. నటి లీలా రామచంద్రన్ పాత్రలో పూజారామచంద్రన్, దేవిగా భూపాల్, ప్రసాద్‌గా మనోజ్ నందం, ప్రధాన పాత్రలు చేశారు. పూజ కంటే ముందు 13 మంది హీరోయిన్లకు ఈ కథ చెబితే... రిజెక్ట్ చేశారు. మీ సినిమాలో నటించం అని చెప్పారు. పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో, తక్కువ బడ్జెట్‌తో 20 రోజుల్లో సినిమా తీశాం. ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నా. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌గారి పేరుని టైటిల్‌గా పెట్టినప్పటికీ... ఆ పేరుని మిస్ యూజ్ చేయలేదు’’ అన్నారు. -
అన్యాయాలను ప్రశ్నించేలా!
అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో, ఓ అందమైన ప్రేమకథగా తెరకెక్కిన చిత్రం ‘యూత్‌ఫుల్ లవ్’. జూలై 3న ఈ చిత్రం విడుదల కానుంది. మనోజ్‌నందం, ప్రియదర్శిని జంటగా రాదారం రాజలింగం నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేముగంటి దర్శకుడు. ‘‘సమాజంలోని అన్యాయాల నేపథ్యంలో అమ్మాయిలు తమను తాము ఎలా రక్షించుకోవాలనే కథాంశంతో తెరకెక్కించాం. అంతర్లీనంగా సందేశం ఉంటుంది’’ అని చెప్పారు. థ్రిల్లర్ మంజు ఇందులో ప్రధాన పాత్రధారి. -
కథే హీరో!
ఓ నలుగురి యువకుల జీవితాల్లోకి అకస్మాత్తుగా ధనలక్ష్మి ప్రవేశిస్తే, వాళ్ల జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అనే క థాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘ధనలక్ష్మి తలుపు తడితే’. ధనరాజ్, మనోజ్‌నందం, శ్రీముఖి, సింధూ తులాని ముఖ్యతారలుగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి అచ్యుత్ చిన్నారి దర్శకుడు. హీరో తనీష్ ప్రత్యేక పాత్ర పోషించారు. భోలే సావలి స్వరాలందించిన ఈ చిత్రం ఆడియో సీడీని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని దర్శకుడు కోదండరామిరెడ్డి అన్నారు. ధనరాజ్ మాట్లాడుతూ - ‘‘అచ్యుత్‌తో ‘సచ్చినోడి ప్రేమకథ’ అనే సినిమా చేయాల్సి ఉంది. కానీ కుదర్లేదు. తర్వాత ఈ కథ చెప్పారు. ఈ చిత్రానికి కథే హీరో’’ అన్నారు. సి.కల్యాణ్, రామసత్యనారాయణ, తనీష్ తదితరులు పాల్గొన్నారు. -
ఎటకారం చేస్తారట!
మనోజ్‌నందం హీరోగా వీరేందర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఎటకారం’. ఎటకారం టీమ్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు దృశ్యానికి దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ కెమెరా స్విచాన్ చేయగా, శాసనసభ్యుడు శ్రీనివాసగౌడ్ క్లాప్ ఇచ్చారు. కోన వెంకట్ గౌరవ దర్శకత్వం వహించారు. ఒక మంచి సినిమా చేద్దామనే ఉద్దేశంతో అయిదుగురం మిత్రులం కలిసి ఈ చిత్రాన్ని నిర్మించామనీ, కామెడీ నేపథ్యంలో సాగే విభిన్న చిత్రమిదనీ నిర్మాతలు కిషన్ కవాడియా, వెంకట్రావ్ అన్నారు. జనవరి 1 నుంచి షూటింగ్ మొదలుపెట్టి, సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేస్తామనీ, రెండు పాటల్ని నేపాల్‌లో తీస్తామనీ దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: ఇసనాక సునీల్‌రెడ్డి. -
సకుటుంబ కథా చిత్రం
మనోజ్‌నందం, స్మితిక, మోనికసింగ్ ప్రధాన తారలుగా పి.రమేశ్ బాబుల్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’. సాకేత్నాయుడు స్వరాలందించిన ఈ చిత్రం ఆడియో సీడీని హీరో సందీప్‌కిషన్ ఆవిష్కరించి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి అందించారు. వీరితో పాటు మాజీ మంత్రి తులసిరెడ్డి, యువ హీరో అభిజిత్.. సినిమా విజయం సాధించాలి ఆకాంక్షించారు. సకుటుంబంగా చూడదగ్గ సినిమా ఇదనీ, సాకేత్ చక్కని సంగీతం ఇచ్చారనీ రమేశ్ బాబుల్‌రెడ్డి అన్నారు. అన్ని పాటలూ బాగా కుదిరాయని సాకేత్ అన్నారు.