ఎటకారం చేస్తారట! | new telugu Etakaram shooting Started | Sakshi
Sakshi News home page

ఎటకారం చేస్తారట!

Published Mon, Dec 22 2014 11:11 PM | Last Updated on Sat, Sep 2 2017 6:35 PM

ఎటకారం చేస్తారట!

ఎటకారం చేస్తారట!

మనోజ్‌నందం హీరోగా వీరేందర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఎటకారం’. ఎటకారం టీమ్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు దృశ్యానికి దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ కెమెరా స్విచాన్ చేయగా, శాసనసభ్యుడు శ్రీనివాసగౌడ్ క్లాప్ ఇచ్చారు. కోన వెంకట్ గౌరవ దర్శకత్వం వహించారు. ఒక మంచి సినిమా చేద్దామనే ఉద్దేశంతో అయిదుగురం మిత్రులం కలిసి ఈ చిత్రాన్ని నిర్మించామనీ, కామెడీ నేపథ్యంలో సాగే విభిన్న చిత్రమిదనీ నిర్మాతలు కిషన్ కవాడియా, వెంకట్రావ్ అన్నారు. జనవరి 1 నుంచి షూటింగ్ మొదలుపెట్టి, సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేస్తామనీ, రెండు పాటల్ని నేపాల్‌లో తీస్తామనీ దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: ఇసనాక సునీల్‌రెడ్డి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement