కథే హీరో! | dhanalakshmi talupu tadithey audio released | Sakshi
Sakshi News home page

కథే హీరో!

Published Sun, Jun 7 2015 9:39 PM | Last Updated on Sun, Sep 3 2017 3:23 AM

కథే హీరో!

కథే హీరో!

 ఓ నలుగురి యువకుల జీవితాల్లోకి అకస్మాత్తుగా ధనలక్ష్మి ప్రవేశిస్తే, వాళ్ల జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అనే క థాంశంతో తెరకెక్కుతున్న  చిత్రం ‘ధనలక్ష్మి తలుపు తడితే’.  ధనరాజ్, మనోజ్‌నందం, శ్రీముఖి, సింధూ తులాని ముఖ్యతారలుగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి అచ్యుత్ చిన్నారి దర్శకుడు. హీరో తనీష్ ప్రత్యేక పాత్ర పోషించారు.  భోలే సావలి స్వరాలందించిన ఈ చిత్రం ఆడియో సీడీని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  ఆవిష్కరించారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని దర్శకుడు కోదండరామిరెడ్డి అన్నారు. ధనరాజ్ మాట్లాడుతూ - ‘‘అచ్యుత్‌తో  ‘సచ్చినోడి ప్రేమకథ’ అనే సినిమా చేయాల్సి ఉంది. కానీ కుదర్లేదు. తర్వాత ఈ కథ చెప్పారు. ఈ చిత్రానికి కథే హీరో’’ అన్నారు. సి.కల్యాణ్, రామసత్యనారాయణ, తనీష్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement