Dhanalakshmi Talupu Tadithey
-
ధనలక్ష్మి తలుపు తడితె
-
'ధనలక్ష్మి తలుపు తడితే' స్టిల్స్
-
కథే హీరో!
ఓ నలుగురి యువకుల జీవితాల్లోకి అకస్మాత్తుగా ధనలక్ష్మి ప్రవేశిస్తే, వాళ్ల జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అనే క థాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘ధనలక్ష్మి తలుపు తడితే’. ధనరాజ్, మనోజ్నందం, శ్రీముఖి, సింధూ తులాని ముఖ్యతారలుగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి అచ్యుత్ చిన్నారి దర్శకుడు. హీరో తనీష్ ప్రత్యేక పాత్ర పోషించారు. భోలే సావలి స్వరాలందించిన ఈ చిత్రం ఆడియో సీడీని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని దర్శకుడు కోదండరామిరెడ్డి అన్నారు. ధనరాజ్ మాట్లాడుతూ - ‘‘అచ్యుత్తో ‘సచ్చినోడి ప్రేమకథ’ అనే సినిమా చేయాల్సి ఉంది. కానీ కుదర్లేదు. తర్వాత ఈ కథ చెప్పారు. ఈ చిత్రానికి కథే హీరో’’ అన్నారు. సి.కల్యాణ్, రామసత్యనారాయణ, తనీష్ తదితరులు పాల్గొన్నారు. -
అనుకోకుండా నిర్మాతనయ్యా!
‘‘ ‘జై’ సినిమాతో నటునిగా పరిచయమయ్యా. ‘జగడం’తో నా కెరీర్ పరుగందుకుంది. ఇప్పటివరకూ ఎనభై సినిమాలు చేశాను. ఇప్పుడు నిర్మాతగా కూడా మారాను’’ అని హాస్యనటుడు ధనరాజ్ చెప్పారు. తుమ్మలపల్లి రామస్యతనారాయణతో కలిసి ధనరాజ్ నిర్మించిన చిత్రం ‘ధనలక్ష్మి తలుపు తడితే’. సాయి అచ్యుత్ చిన్నారి దర్శకునిగా పరిచయమవుతనన్నారు. ఈ సినిమా గురించి ధనరాజ్ మాట్లాడుతూ -‘‘నేను హీరోగా నటించిన ఈ సినిమా అనుకోకుండా ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కోవడంతో నేను నిర్మాతగా మారాల్చి వచ్చింది. చాలా మంచి సినిమా ఇది’’ అని తెలిపారు. దర్శకుడు సుకుమార్, హీరో రామ్ సహకారం వల్లనే తానీ స్థాయికి చేరుకున్నానని ధనరాజ్ ఈ సందర్భంగా కృతజ్ఞత వెలిబుచ్చారు.