
అనుకోకుండా నిర్మాతనయ్యా!
‘‘ ‘జై’ సినిమాతో నటునిగా పరిచయమయ్యా. ‘జగడం’తో నా కెరీర్ పరుగందుకుంది. ఇప్పటివరకూ ఎనభై సినిమాలు చేశాను. ఇప్పుడు నిర్మాతగా కూడా మారాను’’ అని హాస్యనటుడు ధనరాజ్ చెప్పారు. తుమ్మలపల్లి రామస్యతనారాయణతో కలిసి ధనరాజ్ నిర్మించిన చిత్రం ‘ధనలక్ష్మి తలుపు తడితే’. సాయి అచ్యుత్ చిన్నారి దర్శకునిగా పరిచయమవుతనన్నారు. ఈ సినిమా గురించి ధనరాజ్ మాట్లాడుతూ -‘‘నేను హీరోగా నటించిన ఈ సినిమా అనుకోకుండా ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కోవడంతో నేను నిర్మాతగా మారాల్చి వచ్చింది. చాలా మంచి సినిమా ఇది’’ అని తెలిపారు. దర్శకుడు సుకుమార్, హీరో రామ్ సహకారం వల్లనే తానీ స్థాయికి చేరుకున్నానని ధనరాజ్ ఈ సందర్భంగా కృతజ్ఞత వెలిబుచ్చారు.