తెలంగాణలో కొత్తగా ఎన్నికైన 119 వుంది ఎమ్మెల్యేల్లో 63 మందిపై వివిధ రకాల కేసులు ఉన్నాయుని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ వెల్లడించింది.
8 మంది ఎంపీలపై సైతం.. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వెల్లడి
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా ఎన్నికైన 119 వుంది ఎమ్మెల్యేల్లో 63 మందిపై వివిధ రకాల కేసులు ఉన్నాయుని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ వెల్లడించింది. ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో సమర్పించే అఫిడవిట్లలో అభ్యర్థులు కేసుల వివరాలను సరిగా చూపడం లేదని తెలిపింది. కొందరు రెండేళ్లకు పైబడి శిక్షపడే సెక్షన్ల కింద నమోదైన కేసులను కూడా అఫిడవిట్లలో చూపడం లేదని పేర్కొంది. ప్రస్తుతం ఎన్నికైన ఎమ్మెల్యేల్లో టీఆర్‌ఎస్‌లో 40 మంది, టీడీపీలో 9 మంది, కాంగ్రెస్‌లో ఆరుగురు, బీజేపీలో ఇద్దరు, ఎంఐఎంలో ముగ్గురిపై కేసులు న్నాయని సంస్థ వెల్లడించింది. 17 వుంది ఎంపీల్లో 8 వుందిపై కేసులు ఉన్నాయుని తెలిపింది. వారిలో కె. కవితపై అత్యధికంగా 8 కేసులు, కడియం శ్రీహరిపై ఆరు, అసదుద్దీన్ ఒవైసీపై ఐదు, జితేందర్‌రెడ్డిపై నాలుగు, బండారు దత్తాత్రేయపై 3 కేసులు ఉన్నాయుని తెలిపింది.
ఎమ్మెల్యేల్లో అత్యధికంగా జి. కిషోర్ (తుంగతుర్తి)పై 54, ఎస్.రామలింగారెడ్డి (దుబ్బాక)పై 22, తాండూరు మహేందర్‌రెడ్డి, టి. రాజాసింగ్ (గోషామహల్)లపై 19 చొప్పున, ఎం.యాదగిరిరెడ్డి (జనగాం)పై 12, ఈటెల రాజేందర్‌పై 9, గంగుల కమలాకర్ (కరీంనగర్), పాషాఖాద్రి (చార్మినార్) మీద 8 చొప్పున, ఎర్రబెల్లి దయాకర్‌రావు (పాలకుర్తి), వి. వీరేశంపై ఏడు చొప్పున కేసులు నమోదై ఉన్నాయని పేర్కొంది. నేరచరిత్ర ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు సమర్పించే అఫిడవిట్లను రిటర్నింగ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని కోరింది.