సాక్షి, తిరువనంతపురం : దేశంలోని అన్ని శాసనసభల్లోనూ, పార్లమెంట్ సభల్లోనూ నేరారోపణలు ఎదుర్కొంటున్నవారు సభ్యులుగా ఉన్నారు. దేశంలోని ఇతర శాసనసభలతో పోలిస్తే.. కేరళ ఎమ్మెల్యేలలో నేరారోపణలు ఎదుర్కొంటున్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కేరళలోని మొత్తం 140 మంది ఎమ్మెల్యేలో 87 మంది వివిధ నేరారోపణలు ఎదుర్కొంటున్నారు.
కేరళ శాసనసభకు జరిగిన 2016 ఎన్నికల్లో ఆయా సభ్యులు దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగానే వీరిని గుర్తించారు. వారి జాబితా రూపొందించినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రాట్ రిఫార్మ్స్ సంస్థ తెలిపింది. ఈ 87 మందిలో 27పై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. మరికొందరిపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యారోపణలు ఉన్నాయి. ఇందులోనూ కొందరు బెయిల్‌పై బయట ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రాట్ రిఫార్మ్స్ సంస్థ పేర్కొంది.
దేశంలోని ప్రజాప్రతినిధుల కేసులపై విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేయాలంటూ కేంద్రాన్ని సుప్రీం ఆదేశించడంతో.. ప్రస్తుతం నేరారోపణలు ఎదుర్కొంటున్న సభ్యులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment