కేంద్ర కేబినెట్‌లో తెలంగాణకు ప్రాతినిధ్యం దక్కకపోవడంపై పార్టీయే విచారించి చెబుతుందని, దానిపై తానేమీ వ్యాఖ్యానించనని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ చెప్పారు. కేబినెట్‌లో ఎవరికి స్థానం కల్పించాలనే విషయంలో ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టకూడదన్నారు.
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌లో తెలంగాణకు ప్రాతినిధ్యం దక్కకపోవడంపై పార్టీయే విచారించి చెబుతుందని, దానిపై తానేమీ వ్యాఖ్యానించనని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ చెప్పారు. కేబినెట్‌లో ఎవరికి స్థానం కల్పించాలనే విషయంలో ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టకూడదన్నారు. ఢిల్లీలో సోమవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రానికి కేబినెట్‌లో ప్రాతినిధ్యం దక్కకపోవడంపై అడగ్గా..‘ కేబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలి.
ఎవరిని తీసుకోకూడదనే విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకుంటారు. నేను గతంలో మంత్రిగా చేశా. ఇప్పుడు మంచి మెజార్టీతో గెలిచివచ్చా. తెలంగాణకు ఎందుకు ప్రాతినిధ్యం లేదనే విషయం పార్టీ విచారించి ఆలోచించి చెబుతుంది’ అని బదులిచ్చారు. తెలంగాణ అభివృద్ధికి ఎన్డీఏ సహకరిస్తుందంటారా అని ప్రశ్నించగా తెలంగాణ అభివృద్ధి విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి ఉందన్నారు.