తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నెల రోజుల్లోగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, తాగునీటి వసతిని కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్థులకు టాయిలెట్, తాగునీటి సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని.. 40 శాతం పాఠశాలల్లో కూడా టాయిలెట్ సదుపాయం లేదని ఒక స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
విచారణకు తెలంగాణ విద్యాశాఖ అధికారి ఒకరు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలోని పాఠశాలల్లో ఈ సదుపాయాలు కల్పించేందుకు సుప్రీంకోర్టు నెల రోజులు గడువు ఇచ్చిందని చెప్పారు. కాగా, సుప్రీం తీర్పు నేపథ్యంలో ఏయే స్కూళ్లలో తాగునీరు, టాయిలెట్ సదుపాయాలు లేవో గుర్తించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆ సౌకర్యాలను కల్పించేందుకు చర్యలను వెంటనే చేపట్టాలని సూచించారు.
నెల రోజుల్లోగా స్కూళ్లలో టాయిలెట్లు ఏర్పాటు చేయండి
Published Wed, Jul 9 2014 1:26 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement