ప్రభుత్వ పాఠశాలల్లో జవాబుదారీ తనం లేదని, మెరుగైన పనితీరు కనబరిచేందుకు ఉపాధ్యాయుల సర్దుబాటులో
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలల్లో జవాబుదారీ తనం లేదని, మెరుగైన పనితీరు కనబరిచేందుకు ఉపాధ్యాయుల సర్దుబాటులో హేతుబద్ధత ఉండాలని తెలంగాణ పేరెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు జె.సాగర్‌రావు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై రెండు వారాల్లోగా బదులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శివ కీర్తి సింగ్‌తో కూడిన ధర్మాసనం నోటీసులు జారీచేసింది.
ఇక పాఠశాలల్లో మౌలిక వసతులకు సంబంధించిన ప్రధాన పిటిషన్ విచారణలో భాగంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఉపాధ్యాయ నియామక స్థితిగతులను కోర్టుకు వివరించాయి. మే 1న టెట్ నిర్వహించనున్నామని ప్రభుత్వం వివరించింది. కాగా, ఈనెలలో దాదాపు 8 వేల మందికి నియామక పత్రాలు ఇవ్వనున్నామని ఏపీ కోర్టుకు నివేదించింది. దీంతో తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 11కు వాయిదా వేసింది.