సీజేఐను కలవనున్న ‘న్యాయ’ సంఘాల ప్రతినిధులు  | Representatives of legal unions to meet CJI | Sakshi
Sakshi News home page

సీజేఐను కలవనున్న ‘న్యాయ’ సంఘాల ప్రతినిధులు 

Published Fri, Mar 30 2018 2:39 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

Representatives of legal unions to meet CJI

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘాల ప్రతిని«ధులు ఏప్రిల్‌ 5న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాను కలవనున్నారు. ఈ మేరకు వారికి సీజేఐ అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఉమ్మడి హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తి నియామకం విషయంపై వారు సీజేఐతో చర్చించనున్నారు. ఇటీవల ఇదే విషయంపై న్యాయవాదులు రెండు రోజులపాటు తీవ్రస్థాయి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీజేఐ ఇరు సంఘాల ప్రతినిధులతో మాట్లాడనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement