తెలంగాణతో పవన్‌కేం సంబంధం? | pavan kalyan what is the relationship in telengana ? | Sakshi
Sakshi News home page

తెలంగాణతో పవన్‌కేం సంబంధం?

Published Sun, Apr 27 2014 2:54 AM | Last Updated on Sat, Jul 6 2019 3:48 PM

తెలంగాణతో పవన్‌కేం సంబంధం? - Sakshi

తెలంగాణతో పవన్‌కేం సంబంధం?

కరీంనగర్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం

 వీణవంక జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు తెలంగాణతో ఏం సంబంృం ఉందని కరీంనగర్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పవన్.. ఇప్పుడు ఇక్కడ పర్యటించడం బీజేపీ దౌర్భాగ్యమని పేర్కొన్నారుృ  రెమ్యూనరేషన్ తీసుకొని సినిమాల్లో నటించే వ్యక్తి..

అదే రెమ్యూనరేషన్ ఇచ్చి భార్యలకు విడాకులు ఇస్తున్నాడని, అటువంటి వ్యక్తిని బీజేపీ చేరదీసి తమ పార్టీ తరపున ప్రచారం చేయించడం సిగ్గుచేటన్నారు. పవన్ కేవలం డ్రామాలకే పనికి వస్తాడని విమర్శించారు. తెలంగాణ ద్రోహులను ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement