ఆత్మగౌరవాన్ని ఆవిష్కరించబోతున్నారు | we are developing telengana new city - etela | Sakshi
Sakshi News home page

ఆత్మగౌరవాన్ని ఆవిష్కరించబోతున్నారు

Published Thu, May 1 2014 1:26 AM | Last Updated on Mon, Mar 25 2019 3:09 PM

ఆత్మగౌరవాన్ని ఆవిష్కరించబోతున్నారు - Sakshi

ఆత్మగౌరవాన్ని ఆవిష్కరించబోతున్నారు

టీఆర్‌ఎస్‌కు 80శాతానికి పైగా సీట్లు: ఈటెల  

 కమలాపూర్,   అధికార కాంగ్రెస్ పార్టీ అహంకారాన్ని, ప్రతిపక్ష టీడీపీ ధన ప్రవాహాన్ని తొక్కి పడేసి ధర్మానికి, న్యాయానికి పట్టం కట్టి ప్రజలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆవిష్కరించబోతున్నారని టీఆర్‌ఎస్ నేత ఈటెల రాజేందర్  అన్నారు. కరీంనగర్ జిల్లా కమలాపూర్‌లో బుధవారం ఆయన ఓటుహక్కు వినియోగించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్ర నిర్మాణ బాధ్యతను టీఆర్‌ఎస్ మీద పెడితేనే న్యాయం జరుగుతుందని యావత్ తెలంగాణ ప్రజానీకం భావిస్తోందని చెప్పారు.ప్రలోభాలకు లోనుకాకుండా ఆత్మగౌరవాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగానే ఒక ప్రభంజనంలా, వెల్లువలా తీర్పు రాబోతోందని చెప్పారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 80 శాతానికి పైగా సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement