
సర్కారులో చేరికపై కేసీఆర్‌తో చర్చిస్తాం
కొత్తగా ఏర్పాటయ్యే తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వంలో చేరికపై త్వరలోనే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో చర్చలు జరుపుతామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.
టీఆర్‌ఎస్ నేతలతో అసదుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్: కొత్తగా ఏర్పాటయ్యే తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వంలో చేరికపై త్వరలోనే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో చర్చలు జరుపుతామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఇదే అంశంపై ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిగాయని, పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉందన్నా రు. తమకు ప్రభుత్వంలో చేరడం ముఖ్యం కాదని, హైదరాబాద్ అభివృద్ధి ముఖ్యమన్నారు. సోమవారం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు అక్బరుద్దీన్‌లతో టీఆర్‌ఎస్ నేతలు ఈటెల, కేటీఆర్, నాయిని, టి.పద్మారావు భేటీ అయ్యారు.
అక్బరుద్దీన్ నివాసంలో గంటకు పైగా వీరు చర్చలు జరిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రాధాన్యతలు, కేబినెట్ రూపకల్పన, ఎంఐఎం భాగస్వామ్యం తదితర అం శాలు వీరిమధ్య చర్చకు వచ్చాయి. అనంతరం అసదుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ చెప్పిన గంగా జమునా తెహజీబ్ తమకు నచ్చిందన్నారు. సెక్యులర్ పార్టీలతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, కొత్త ప్రభుత్వానికి తమ మద్దతు, సహకారం ఉంటుందన్నారు.