
నిర్మల్‌టౌన్: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన బాగుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం ఆయనతో కలసి పని చేస్తామని చెప్పారు. నిర్మల్‌లో సోమవారం రాత్రి జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో మైనార్టీలకు ఎంతో మేలు కలిగిందని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు, కాంగ్రెస్ హయాంలో వక్ఫ్ బోర్డు భూములను హైటెక్ సిటీ పేరిట సాఫ్ట్‌వేర్ కంపెనీలకు ధారాదత్తం చేశారని విమర్శించారు.
రానున్న ఎన్నికల్లో గెలిచిన తరువాత షాదీ ముబారక్‌కు అందిస్తున్న రూ.లక్షను రూ.2 లక్షలకు పెంచే విధంగా ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు. తమ పార్టీని తెలంగాణలోనే కాకుండా పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, బిహార్‌లోనూ విస్తరిస్తామని ఒవైసీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment