ప్రతిభ ఎవడి సొత్తూ కాదు. కానీ అసామాన్య ప్రతిభ మాత్రం కొందరికే సొంతం. రోజూ చేసే పనే అయినా దానిలో బుద్ధి కుశలతను ప్రదర్శించి, మేధో తనాన్ని రంగరించి కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతారు. ఆధునిక పోకడలకు, తమదైన టెక్నాలజీ జోడించి శభాష్ అనుపించుకుంటారు. అలాంటి నైపుణ్యంతో ఒక కార్పెంటర్ వార్తల్లో నిలిచారు. ఈ కళాకారుడు హస్తకళా నైపుణ్యంతో సత్యనారాయణ వ్రత పీఠాన్ని తయారు చేసిన తీరు అద్భుతంగా నిలిచింది. (ఆనంద్ మహీంద్ర ఎమోషనల్ వీడియో: బిగ్ సెల్యూట్ అంటున్న నెటిజన్లు)
నేతన్న నైపుణ్యాన్ని చిన్న అగ్గిపెట్టెలో చీరను మడిచిపెట్టిన చందంగా ఒక కార్పెంటర్ పెట్టెలో పూజా పీఠాన్ని విడిగా అమర్చాడు. ఆ తరువాత ఒక్కో భాగాన్ని తీసి ఒక క్రమంగా పద్దతిలో ఎటాచ్ చేయడం సూపర్బ్‌గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోను రాగుల సంపత్ ట్విటర్‌లో షేర్ చేశారు. దీన్ని తెలంగాణా ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ ఆయనకు సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీనికి ఫిదా అయిన కేటీర్ చాలా గ్రేట్ స్కిల్ అంటూ కమెంట్ చేశారు. అతనికి ఎలా చేయూత అందించవచ్చో పరిశీలించాల్సిందిగా సంబంధింత అధికారులకు ట్విటర్ ద్వారా సూచించారు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లును విపరీతంగా ఆకట్టుకుంటోంది. (దుబాయ్‌లో మరో అద్భుతం: ఈ వీడియో చూస్తే మతిపోవాల్సిందే!)
Absolutely great skill
— KTR (@KTRBRS) August 16, 2023
Request @TWorksHyd to reach out to see how we could help https://t.co/KQe8zKOrCY
Comments
Please login to add a commentAdd a comment